Custom Heading

పూంచ్-రాజౌరీ జిల్లా ఎన్కౌంటర్
శ్రీనగర్ : అక్టోబర్ 24 (హింస)దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పూంచ్ ఎన్కౌంటర్లో భద్రతా దళాలకు మరో ఎద
పూంచ్-రాజౌరీ జిల్లా ఎన్కౌంటర్


శ్రీనగర్ : అక్టోబర్ 24 (హింస)దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పూంచ్ ఎన్కౌంటర్లో భద్రతా దళాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితో సహా.. బందీగా ఉన్న మరో ఉగ్రవాదిని గాయపర్చారు. భాతా-దురియా వద్ద ఎన్కౌంటర్ జరుగుతోన్న ప్రదేశానికి పోలీసులు, సైనికులు కలిసి.. తమ వెంట లష్కరే సంస్థకు చెందిన జియా ముస్తఫా అనే పాకిస్థానీ ఉగ్రవాదిని తీసుకెళ్లారు. ఆ ఉగ్రవాదితో కలిసి అడవిలోని ఓ ఉగ్ర స్థావరం వద్దకు భద్రతా దళాలు చేరుకొన్నాయి. అదే సమయంలో ఆ స్థావరంలో నక్కిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితోపాటు ఉగ్రవాది ముస్తఫా కూడా గాయపడ్డాడు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుదాడి ప్రారంభించాయి.

కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆగస్టులోనే సైన్యం భారీ ఎత్తున గాలింపు చేపట్టింది. గాలింపు బృందాలకు సురాన్కోటెలోని డేరాకి గల్లీ ప్రాంతంలో అక్టోబర్ 10-11 అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులతో మొదటిసారిగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక జేసీవోతో సహా ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రదేశం పూంచ్-రాజౌరీ జిల్లాల మధ్యలో ఉంటుంది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్

 rajesh pande