Custom Heading

గులాబి ప్లీనరీ అన్ని సిద్ధం
హైదరాబాద్: నాలుగేళ్లకోసారి జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా మారింది.
గులాబి ప్లీనరీ అన్ని సిద్ధం


హైదరాబాద్: నాలుగేళ్లకోసారి జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా మారింది. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరం గులాబీమయంగా మారింది. హైటెక్స్లో రేపు జరగనున్న ప్లీనరీకి గులాబీ పార్టీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 6 వేలకు పైగా పార్టీ ప్రతినిధులు హాజరు కానున్న సభలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ను పార్టీ అధ్యక్షుడిగా రేపు లాంఛనంగా ఎన్నుకోనున్నారు. ఏప్రిల్ లోనే ప్లీనరీ జరగాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేల మంది తెరాస ప్రతినిధులు రేపటి ప్లీనరీకి హాజరుకానున్నారు. ప్రతినిధులకు ప్రత్యేక పాస్లు జారీ చేశారు. మహిళలకు గులాబీ చీర, పురుషులు గులాబీ చొక్కాతో సభకు హాజరుకావాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే నిర్దేశించింది. సుమారు 300 అడుగుల వేదికను ముస్తాబు చేస్తున్నారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande