టీఆర్ఎస్ లో దళితులెవరూ అధ్యక్ష పదవికి అర్హులు కారా?
హుజూరాబాద్, 24 అక్టోబర్ (హిం.స)‘‘ కేసీఆరే సీఎంగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉంటారా? పార్టీ పెట్టినప్పటి
టీఆర్ఎస్ లో దళితులెవరూ అధ్యక్ష పదవికి అర్హులు కారా?


హుజూరాబాద్, 24 అక్టోబర్ (హిం.స)‘‘ కేసీఆరే సీఎంగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉంటారా? పార్టీ పెట్టినప్పటి నుండి 20 ఏళ్లుగా కేసీఆరే అధ్యక్షుడిగా ఉంటారా? రేపు కూడా మళ్లా ఆయనే కొనసాగుతారా? ఇదేం విడ్డూరం.... కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్, కూతురు సిట్టింగ్ ప్రెసిడెంట్, అల్లుడు స్టాండింగ్ ప్రెసిడెంట్, మరదలి కొడుకు సంతోష్ రావు స్లీపింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ పార్టీని ఏలుతున్నరు. కేసీఆర్... ఇన్నాళ్లూ దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసినవ్. ఉప ముఖ్యమంత్రి ఇస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని, దళిత బంధు ఇస్తానని మోసం చేసినవ్. కనీసం రేపటి ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్ష పదవినైనా దళితుడికి అప్పగించి చిత్తుశుద్ధి నిరూపించుకుంటావా?...నీకు ఆ దమ్ముందా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. దుబాయిలో బూర్జ్ ఖలీఫా వద్ద కల్వకుంట్ల కవిత కేసీఆర్ ఫోటో పెట్టి బతుకమ్మ ఆడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలాడుతున్నారని, బీజేపీ వల్లే దళితబంధు ఆగటిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మొన్నటి వరకు తన ముఖం చూసి ఓటేయాలని చెప్పిన కేసీఆర్ ఎన్నికల్లో ఆయన ముఖం చెల్లడం లేదన్నారు. అందుకే డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఈ ఎన్నికలను చిన్నవిగా చూపుతూ ప్లీనరీ పేరిట పెద్ద సీనరీ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. హుజూరాబాద్ గడ్డమీద కాషాయ జెండాను రెపరెపలాడించడం ఖాయమన్నారు. ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను తరిమితరిమి కొడతారని, డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట మండలం రాచపల్లి, టేకుర్తి గ్రామాల్లో ఆదివారం బండి సంజయ్ కుమార్ ప్రచారం నిర్వహించారు

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande