జోన్ వ్యాప్తంగా కిసాన్ రైళ్ల రవాణా భారీ విజయవంతం
పి.ఆర్.నెం.489 తేది :24 అక్టోబర్, 2021 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలోని వేర్
జోన్ వ్యాప్తంగా కిసాన్ రైళ్ల రవాణా భారీ విజయవంతం


పి.ఆర్.నెం.489 తేది :24 అక్టోబర్, 2021

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలోని వేర్వేరు స్టేషన్ల నుండి

500 కిసాన్ రైళ్లను నడిపించిన దక్షిణ మధ్య రైల్వే

` నేటి వరకు 1.6 లక్షల టన్నులకు పైగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా

దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కిసాన్ రైళ్లను ప్రారంభించిన తేదీ నుండి నేటి వరకు 500కు పైగా కిసాన్ రైళ్లను నడిపించింది, జోన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలోని వేర్వేరు రైల్వే స్టేషన్ల నుండి ఈ 500 కిసాన్ రైళ్లు నడపబడినాయి. నేటి వరకు, దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు ముఖ్యంగా తూర్పు, ఉత్తర మరియు ఈశాన్య ప్రాంతాలకు 1.6 లక్షల టన్నులకు పైగా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేశారు. ఈ గొప్ప మైలురాయిని సాధించిన దక్షిణ మధ్య రైల్వే బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు మరియు దేశంలో వ్యవసాయ రంగానికి తోడ్పాటు అందించడంలో జోన్ భాగస్వామ్యం కావడం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు.

వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని రెండిరతలు చేయాలనే లక్ష్యంతో కిసాన్ రైలు ప్రతిపాదనను 2020`21 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా, సజావుగా మరియు మార్గంలో సరుకులు చెడిపోకుండా వేగవంతంగా రవాణా చేసేలా భారతీయ రైల్వే వారు ప్రత్యేక చొరవ తీసుకొని దీనిని విజయవంతంగా ప్రారంభించారు. దీనికి అదనంగా, కిసాన్ రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను చేరవేయడంలో సరుకు రవాణా చార్జీలలో 50% రాయితీ కూడా ఇవ్వబడుతుంది.

తదనుగుణంగా, దక్షిణ మధ్య రైల్వేలో మొదటి కిసాన్ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ స్టేషన్ నుండి 9 సెప్టెంబర్, 2020 తేదీన నడపించారు. ఇది దక్షిణ భారత దేశంలో కూడా మొదటి కిసాన్ రైలు. అదేవిధంగా తెలంగాణలో మొదటి కిసాన్ రైలు వరంగల్ స్టేషన్ నుండి 8 ఫిబ్రవరి 2021 తేదీన నడపబడిరది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగర్సోల్ స్టేషన్ నుండి 5 జనవరి 2021 తేదీన మొదటి కిసాన్ రైలు నడిపించారు. దక్షిణ మధ్య రైల్వేలో కిసాన్ రైళ్లు ప్రారంభించిన నాటి నుండి విజయవంతంగా నడపబడ్డాయి. వివిధ రకాల కూరగాయాలు, పండ్లు ముఖ్యంగా దేశంలోని సుదూర రాష్ట్రాలకు రవాణా అయ్యాయి. ఈ రైళ్లతో ప్రత్యేకించి కోవిడ్`19 మహమ్మారి సమయంలో వ్యవసాయ రైతులకు/వ్యాపారస్తులకు వారి ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభించడానికి ప్రయోజనం చేకూరింది. మొత్తంమీద మహారాష్ట్ర రాష్ట్రం నుండి 359 కిసాన్ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 78 కిసాన్ రైళ్లు, తెలంగాణ రాష్ట్రం నుండి 63 కిసాన్ రైళ్లు నడపబడినాయి.

జోన్ వ్యాప్తంగా కిసాన్ రైళ్ల రవాణా భారీ విజయవంతం కావడంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్య ఆనందం వ్యక్తం చేశారు. కిసాన్ రైళ్ల ద్వారా రైతులు మరియు వ్యాపారస్తులు వారి ఉత్పత్తులు రవాణా చేయడానికి సాధ్యమైనతంగా పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande