వ్యాక్సినేషన్ విజయవంతం.. కొత్త ఉత్సాహంలో దేశం,మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోదీ
దిల్లీ: అక్టోబర్ 24 (హింస)‘100 కోట్ల డోసులు పూర్తయిన క్రమంలో దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోం
వ్యాక్సినేషన్ విజయవంతం.. కొత్త ఉత్సాహంలో దేశం,మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్ర మోదీ


దిల్లీ: అక్టోబర్ 24 (హింస)‘100 కోట్ల డోసులు పూర్తయిన క్రమంలో దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమ సఫలత మన దేశ సామర్థ్యాన్ని చూపుతోంది. ప్రతి ఒక్కరి ప్రయత్నాల ఫలితాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఆరోగ్య కార్తకర్తల కృషితో ఇది సాధ్యమైంది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రధాని ‘మన్ కీ బాత్’ 82వ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని ప్రశంసించారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్కు చెందిన ఆరోగ్య కార్యకర్త పూనమ్ నౌటియాల్తో సంభాషించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆమె అనుభవాలు, ఎదురైన సవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

* అక్టోబర్ 31న ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని.. ఆయనకు నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశభక్తి, ఐక్యత విషయంలో పటేల్ నుంచి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

* హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande