మద్యం షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల అరెస్టు
, 24 అక్టోబర్ (హిం.స) వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు పక్క జిల్లాలోని మద్యం షాపులతో పాటు ఫర్టిల
మద్యం షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల అరెస్టు


, 24 అక్టోబర్ (హిం.స) వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు పక్క జిల్లాలోని మద్యం షాపులతో పాటు ఫర్టిలైజర్ , కిరాణా దుకాణాలను లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పర్వతగిరి పోలీసులు ఆదివారం అరెస్టు చేసారు. అరెస్టు చేసిన దొంగల నుండి 76వేల రూపాయల నగదు, రెండు కరెంటు మోటార్లు, పివిసి పైపులు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.శరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామం, టూక్య తండాకు చెందిన అజ్మీరా హేమ(వయస్సు 40), అజ్మీరా మోహన్ (వయస్సు 42),మాలోత్ వీరన్న (వయస్సు 45) వున్నారు. ఇందులో ఆజ్మీరా హేమ, అజ్మీరా మోహన్ ఇద్దరు స్నేహితులు కావడంతో పాటు ఇరువురు వ్యవసాయం చేస్తూ వుండేవారు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో నిందితులు మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. దీనితో వీరికి వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం వీరి జల్సాలకు సరిపోకపోవడంతో నిందితులు చోరీ చేసేందుకు సిద్ధపడి సూమారు 22 సంవత్సరాల క్రితమే నిందితులు ఇద్దరు కల్సి యాభైకి పైగా చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేయడంతో ఇరువురు నిందితులపై నేరాలు కోర్టులో రుజువు కావడంతో పలుమార్లు కోర్టు విధించిన జైలు శిక్షలు కూడా అనుభవించారు. నిందితులు చివరిసారిగా దేవరుప్పుల పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్ షాపులో చోరీకి పాల్పడటంతో నిందితులను పోలీసులు అరెస్టు జైలుకు తరలించారు. తిరిగి కోద్ది రోజులకు జైలు విడుదలయిన నిందితులు ఇద్దరు తమ స్వగ్రామములోనే జీవితం గడపగా, వీరిపై పర్వతగిరి పోలీసులు డి.సి షీట్ ను తెరవడం జరిగింది.

నిందితులు గత కొద్ది కాలంగా ఎలాంటి చోరీలకు పాల్పడకుండా తిరిగి వ్యవసాయం చేసుకునే నిందితులు తిరిగి మద్యంకు అలవాటు పడటంతో మద్యం కోసం మరోమారు చోరీలకు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా గత సంవత్సరంలో నిందితులు ఒక ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి పగటి సమయాల్లో గ్రామ శివారు ప్రాంతాల్లో వుందే మద్యం షాపులను గుర్తించి రాత్రి సమయాల్లో నిందితులు మద్యం షాపు షటర్ తాళాలు పగులగొట్టి షాపులోని మద్యం సీసాలతో పాటు క్యాచ్ కౌంటర్లోని డబ్బును చోరీ చేసేవారు. ఇదే సమయంలో నిందితులు షాపులోని సిసి కెమెరాలతో పాటు, డివిఆర్ను దొంగిలించి వాటిని ద్వంసం చేసి బయట పడేవేసేవారు.

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande