Custom Heading

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం
అమెరికా, 6 అక్టోబర్ (హిం.స)ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 2 నెలలుగా ఏ దేశంలోనూ
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం


అమెరికా, 6 అక్టోబర్ (హిం.స)ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 2 నెలలుగా ఏ దేశంలోనూ ఇన్ఫెక్షన్ పెరుగుదల నమోదుకాలేదు.గత రెండు నెలల్లో అమెరికాలో 35 శాతం కేసులు తగ్గిపోగా.. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం కేసులు తగ్గినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మన మధ్య నుంచి కరోనా పూర్తిగా తొలిగిపోలేదు. మన జాగ్రత్తలతోనే దానిని పెరుగకుండా చూసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా పలు దేశాల్లో దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోతున్నట్లు గుర్తించారు.

గత 2 నెలల్లో ఏ దేశంలోనూ ఇన్ఫెక్షన్ పెరగలేదు. కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతుండటంతో, రోగులను దవాఖానల్లో చేర్పించడం తగ్గింది. అమెరికాలో సెప్టెంబర్ 1 న ప్రతిరోజూ వచ్చే కరోనా కేసుల్లో 35 శాతం తగ్గుదల కనిపించింది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా కేసులు 30 శాతం తగ్గాయి. యూఎస్లో కేసుల తగ్గుదలను రెండు నెలల నమూనాగా కూడా చూడవచ్చని స్క్రిప్స్ రీసెర్చ్కు చెందిన డాక్టర్ ఎరిక్ టోపాల్ అన్నారు. డెల్టా వేరియంట్ కారణంగా యూఎస్లో గతంలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, కరోనాపై ప్రజలకు అవగాహన కారణంగా కేసులు తగ్గుతున్నట్లు మిన్నెసోటా విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ మైఖేల్ ఓస్టర్హోమ్ పేర్కొంటున్నారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి

 rajesh pande