అభిమానులకి ఎప్పుడు అండగా ఉండే ఎన్టీఆర్
రాజోలు, 7 అక్టోబర్ (హిం.స)తూర్పు గోదావరి జిల్లా మండలం ఎన్టీఆర్ గారి వీరాభిమాని కొప్పాడి మురళి ఇటీవల
అభిమానులకి ఎప్పుడు అండగా ఉండే ఎన్టీఆర్


రాజోలు, 7 అక్టోబర్ (హిం.స)తూర్పు గోదావరి జిల్లా మండలం ఎన్టీఆర్ గారి వీరాభిమాని కొప్పాడి మురళి ఇటీవల యాక్సిడెంట్ కి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతనికి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళి తన చివరి కోరిక గా అతను ఎంతో అభిమానించే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి తో కలవాలని డాక్టర్లకు చీటీ రాసి చూపించాడు. డాక్టర్లు తన తల్లిదండ్రులకు బంధువులకు తెలియజేశారు. వారు తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు. రాయుడు బాబ్జి గారికి భాస్కర్ చౌదరి గారికి తెలియ చేశారు. వారు ఎన్టీఆర్ గారికి ఈ విషయాన్ని తెలియజేశారు. తనను ఎంతగానో ప్రేమిస్తున్న తన అభిమాని కి ఇలా జరగడం ఆయన ను కలచివేసింది. వెంటనే ఎన్టీఆర్ గారు మురళి తో వీడియో కాల్ చేసి పరామర్శించారు. తన ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్ గారు ను చూసి న మురళి ఆనందోత్సాహంతో ఉప్పొంగి పోయాడు ఆయనను చూసిన మురళి సంపూర్ణ ఆరోగ్యంతో మూడు నెలల్లో బయటకు వస్తానని తన సైగలతో ఎన్టీఆర్ గారి వివరించాడు.

తన అభిమాని సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని ఎన్టీఆర్ గారు మురళి ధైర్యం చెప్పారు. అభిమానులకి ఎప్పుడు అండగా ఉండే ఎన్టీఆర్ గారికి మురళి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ధన్యవాదాలు తెలియజేశారు

హిందూస్తాన్ సమాచార్ నాగరాజ్ రావు, సంతోషలక్ష్మి


 rajesh pande