ఒకే ఫోన్ నంబరు ఇద్దరు వినియోగిస్తే
అమరావతి, 15 నవంబర్ (హిం.స) తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా రూపొందిన చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్
ఒకే ఫోన్‌ నంబరు ఇద్దరు


అమరావతి, 15 నవంబర్ (హిం.స) తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా రూపొందిన చిత్రం ‘అద్భుతం’. మల్లిక్ రామ్ దర్శకుడు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. ఈ సినిమా నేరుగా డిజిటల్ మాధ్యమంలో విడుదలవుతోంది. ప్రముఖ ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్స్టార్’లో నవంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నటుడు రామ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికి.. ఒకే ఫోన్ నంబరు ఉంటే ఏమవుతుందనే విభిన్న కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందినట్టు ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. కామెడీ, సస్పెన్స్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. మరి తేజ, శివానీ జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి? ఒకే ఫోన్ నంబరును ఎలా వినియోగించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మించిన ఈ చిత్రానికి రథన్ సంగీతం అందించారు.

హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande