ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమై.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న స్వల్ప నష్టాలతో
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమై.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయ
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమై.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న స్వల్ప నష్టాలతో

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమై.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న స్వల్ప నష్టాలతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్ పెరగడం, అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డులు ఎగబాకడం, టోకు ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ఠానికి చేరడం వంటి పరిణామాలు సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి.

ఈ నేపథ్యంలో ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 60,603 వద్ద.. నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో 18,083 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.43 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్అండ్టీ, మారుతీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్యూఎల్, సన్ఫార్మా రాణిస్తున్న వాటిలో ఉన్నాయి.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్

 rajesh pande