దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై బేర్ పట్టు కొనసాగుతోంది
ముంబయి, 23 నవంబర్ (హిం.స): . మంగళవారం కూడా సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై బేర్ పట్టు కొనసాగుతోంది


ముంబయి, 23 నవంబర్ (హిం.స): . మంగళవారం కూడా సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయంగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంటుండడం, సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడం వంటి కీలక నిర్ణయాలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. మరోవైపు సోమవారం ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ 641 పాయింట్ల నష్టంతో 57,823 వద్ద.. నిఫ్టీ 176 పాయింట్ల నష్టంతో 17,239 వద్ద ట్రేడవుతున్నాయి.

హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande