ఏ. పి. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కు 15 మంది డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం
ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : నవంబర్ 24 ( హింస) రాష్ట్రంలో డెవలప్ మెంట్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్ అండ్ పార్క్స
ఏ. పి. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కు 15 మంది డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం


ఆంధ్ర ప్రదేశ్ :అమరవతి : నవంబర్ 24 ( హింస)

రాష్ట్రంలో డెవలప్ మెంట్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్ అండ్ పార్క్స్ కార్యక్రమం క్రింద 32 పట్టణ ప్రాంతాలలో రూ. 92 కోట్లతో 90 పార్క్ ల అభివృద్ధికి పనులు చేపట్టామని ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్. రామారావు అన్నారు.

విజయవాడ భవానీపురం వద్ద బెర్మ్ పార్క్ లో బుధవారం ఉదయం నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ సంస్థలు, మునిసిపాలిటీస్, హాస్పిటల్స్, యూనివర్సిటీలకు కన్సల్ టెన్సీ పద్దతిలో పచ్చదనం పెంపొందించుటలో, అత్యంత సుందరంగా తీర్చి దిద్దుటలో ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ సంస్థ ముఖ్య భూమిక పోషిస్తున్నదని ఆయన అన్నారు.

2021-22 సంవత్సరంలో 124 నగర, పట్టణ ప్రాంతాలలో 25 కోట్ల మొక్కలను నాటి పెంచే కార్యక్రమాన్ని చేపట్టామని రామారావు అన్నారు. రాష్ట్రంలో ప్లాంటేషన్ మరియు బ్యూటిఫికేషన్ కార్యక్రమం 12 ప్రభుత్వ హాస్పిటల్స్ లో 30 ఎకరాలలో చేపట్టామని తెలిపారు.

శ్రీశైలం శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ పట్టణాలు, నగర పంచాయతీల పరిధిలో పచ్చదనం మరియు పరిశుభ్రతతో కూడిన సుందరీ కరణ కొరకు ప్రభుత్వం రూ. 45 కోట్లు కేటాయించిందని అన్నారు. ఈ కార్పొరేషన్ పట్టణాలు, నగరాలలో ఆహ్లద కరమైన వాతావరణం కల్పించుటకు కృషి చేస్తున్నదని చక్రపాణి రెడ్డి అన్నారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ లు మరియు శ్రీశైలం శాసన సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, కే. కోట శాసన సభ్యులు కే. శ్రీనివాస్, విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎం.డి. డి. వి. సంపత్ కుమార్, జనరల్ మేనేజెర్ బలరామి రెడ్డి, 15 మంది నూతనంగా ఎంపికైన డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

ముందుగా ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ ఎన్. రామారావు నూతనంగా ఎంపికైన 15 మంది డైరెక్టర్ ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

డైరెక్టర్లుగా ప్రమాణం చేసిన వారిలో అనంతపురం జిల్లా నుండి సి. సుజాత, జె. సరళ, చిత్తూర్ నుండి షేక్ ఫర్జానా, ఆర్. గుణశేఖర్ రెడ్డి, గుంటూరు నుండి షేక్ జానీ, చింతా కిరణ్ కుమార్, కడప నుండి కే. భరత్, కృష్ణా నుండి పి. రాణి, కర్నూల్ నుండి శ్రీ బి. నాగ భూపాల్ రెడ్డి, నెల్లూరు నుండి కే. సౌజన్య, ఒంగోలు నుండి కే. అంజి రెడ్డి, విశాఖపట్టణం నుండి అల్యా నూరాని, సిహెచ్. సత్యవతి, విజయనగరం నుండి సత్యరా, పశ్చిమ గోదావరి జిల్లా నుండి కే. ఉమామహేశ్వరి లు డైరెక్టర్ లుగా ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం విజయవాడ ఏ. పి. గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ ఎన్. రామారావు మొక్కలు నాటారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande