జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ట్రాఫిక్ కష్టాలు
ట్రాఫిక్తో తంటాలు జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ట్రాఫిక్ కష్టాలు తెలంగాణ: మహబూబ్ నగర్ జిల్లా :నవంబ
జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ట్రాఫిక్ కష్టాలు


ట్రాఫిక్తో తంటాలు

జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ట్రాఫిక్ కష్టాలు

తెలంగాణ: మహబూబ్ నగర్ జిల్లా :నవంబర్ 24( హిం స)ర్లలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద చౌరస్తాలో ప్రజలకు నిత్యం ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. పట్టణంలోని ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది మంది వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఫ్లైఓవర్ కింద నిత్యం రద్దీగా ఉంటుంది ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది గంటలతరబడి వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అవస్థలు పడుతున్నారు. బుధవారం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ్లైఓవర్ కింద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే నిబంధనలు పాటించి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న వాహనాలకు, హైదరాబాద్ నుంచి, కర్నూల్ వైపు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఇలా అనేక మార్గాలకు వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాయంత్రం వేళ పోలేపల్లి సెజ్ నుంచి ఫార్మా కంపెనీ బస్సులు హైదరాబాద్ షాద్ నగర్ వెళ్లే వాహనాలు అక్కడే ఆపడంతో ఫ్లైఓవర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. రద్దీగా ఉండే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే కొంత మేర ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

హిందూస్తాన్ సమాచార్ మహి పాల్ రెడ్డి


 rajesh pande