Custom Heading

శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్నబంగారం పట్టివేత
తెలంగాణ : హైదరాబాద్: నవంబర్ 24 ( హింస) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగ
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్నబంగారం పట్టివేత


తెలంగాణ : హైదరాబాద్: నవంబర్ 24 ( హింస)

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. షార్జా నుంచి ఓ ప్రయాణికుడు బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా అతడి చేతి గడియారం లోపలిభాగంలో అక్రమంగా తరలిస్తున్న 233.4గ్రాముల బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు బంగారాన్ని సీజ్చేసి నిందితున్ని అరెస్టు చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.11.56లక్షలు ఉంటుందని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande