పెగాసస్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో యాపిల్ కంపెనీ ఎట్టకేలకు స్పందించింది.
న్యూఢిల్లీ:, 24 నవంబర్ (హిం.స) ఇజ్రాయెల్కు చెందిన టెక్నాలజీ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్.. పెగాసస్ స్పైవే
పెగాసస్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో యాపిల్ కంపెనీ ఎట్టకేలకు స్పందించింది.


న్యూఢిల్లీ:, 24 నవంబర్ (హిం.స) ఇజ్రాయెల్కు చెందిన టెక్నాలజీ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్.. పెగాసస్ స్పైవేర్ను ఇతర దేశాలకు అమ్ముతుంటుంది. అయితే ప్రభుత్వాలు మాత్రమే మెయింటెన్ చేసే ఈ స్పైవేర్ను.. హ్యాకర్లు లక్క్ష్యం చేసుకున్నారని, పలువురు ప్రముఖుల ఫోన్ డేటాను తస్కరించారనే ఆరోపణలతో ‘పెగాసస్ స్కామ్’ వెలుగుచూసింది. పైగా యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా లక్క్ష్యం అయ్యిందని, భవిష్యత్తులోనూ ఐఫోన్లు వాడేవాళ్ల డేటా తేలికగా హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది.

పెగాసస్ స్కామ్ నేపథ్యంలోనే మంగళవారం స్పైవేర్ మేకర్ ఎన్ఎస్వోపై దావా వేసింది. పెగాసస్ స్పైవేర్పై అమెరికా ఆంక్షలు విధించిన రెండు వారాలకే యాపిల్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేకాదు ఎన్ఎస్వో గ్రూప్ యాపిల్కు సంబంధించి ఎలాంటి డివైజ్లను, సాంకేతికతను, సేవలను, వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఫెడరల్ కోర్టును యాపిల్ అభ్యర్థించింది.

హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande