Custom Heading

మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ పోలీసుల విచారణ హాజరు
ముంబై, 25 నవంబర్ (హిం.స): పరారీలో ఉన్న ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ పోలీసుల విచారణలో పాల్గొన్నా
మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ పోలీసుల విచారణ హాజరు


ముంబై, 25 నవంబర్ (హిం.స): పరారీలో ఉన్న ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ పోలీసుల విచారణలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో అవినీతి, అక్రమాల ఆరోపణలకు సంబంధించి పరంబీర్పై ఐదు కేసులున్నాయి.పరంబీర్ కు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో పోలీసుల విచారణలో పాల్గొనేందుకు కండివాలిలోని ముంబై పోలీసు క్రైంబ్రాంచ్ కార్యాలయానికి వచ్చారు.గోరేగావ్ పోలీసులు నమోదు చేసిన అవినీతి కేసు విచారణ కోసం పరంబీర్ వచ్చారు. పరారీలో ఉన్న పరంబీర్ ఇన్నాళ్లు చండీఘడ్ లో దాక్కున్నాడని వెల్లడైంది. బుధవారం పరంబీర్ టెలిగ్రాంలో కనిపించిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో తన ఖాతాను తొలగించారు.

హిందూస్తాన్ సమాచార్/నాగరాజ్

 rajesh pande