సినీ పరిశ్రమపై జీఎస్టీని రద్దు చేయాలి
ముంబై,, 25 నవంబర్ (హిం.స)కొవిడ్ మహమ్మారితో కుదేలైన సినీరంగం పునరుజ్జీవానికి దోహదపడేలా వినోద పరిశ్రమప
సినీ పరిశ్రమపై జీఎస్టీని రద్దు చేయాలి


ముంబై,, 25 నవంబర్ (హిం.స)కొవిడ్ మహమ్మారితో కుదేలైన సినీరంగం పునరుజ్జీవానికి దోహదపడేలా వినోద పరిశ్రమపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను రద్దు లేదా గణనీయంగా తగ్గించాలని అభ్యర్థిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ద ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ) బుధవారం లేఖ రాసింది. ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి పెట్టని ఈ పరిశ్రమ నుంచి ఆదాయంలో సింహ భాగం సర్కారే తీసుకుంటున్నట్టు ఐఎంపీపీఏ పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశ్రమ పునరుజ్జీవానికి వన్టైమ్ చర్యగా జీఎస్టీ, ఇతర పన్నులను రద్దు చేయడం ద్వారా పరిశ్రమకు కొత్త శక్తిని తప్పనిసరిగా అందించాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపింది.

హిందూస్తాన్ సమాచార్/నాగరాజ్


 rajesh pande