స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టెగా ఇండస్ట్రీస్ రూ. 7,868 కోట్లు సమీకరించనున్నాయి
న్యూఢిల్లీ: మార్కెట్లో పబ్లిక్ ఇష్యూల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ వారం మరో రెండు సంస్థలు ఇనీషియల్ ప
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టెగా ఇండస్ట్రీస్ రూ. 7,868 కోట్లు సమీకరించనున్నాయి


న్యూఢిల్లీ: మార్కెట్లో పబ్లిక్ ఇష్యూల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ వారం మరో రెండు సంస్థలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి వస్తున్నాయి. వీటిలో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవి రెండు కలిసి సుమారు రూ. 7,868 కోట్లు సమీకరించనున్నాయి. స్టార్ హెల్త్ ఐపీవో నవంబర్ 30న మొ దలై డిసెంబర్ 2న ముగుస్తుంది. అటు టెగా ఇండస్ట్రీస్ ఇష్యూ డిసెంబర్ 1–3 మధ్య ఉంటుంది. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ షేరు ధర శ్రేణిని రూ. 870–900గా నిర్ణయించింది. సుమారు రూ. 7,249 కోట్లు సమీకరిస్తోంది.అటు టెగా ఇండస్ట్రీస్ రూ. 619 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూ తలపెట్టింది. షేరు ధర శ్రేణి రూ. 443–453.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande