జిన్పింగ్కు మూడోసారీ పట్టం
,బీజింగ్ 9 నవంబర్ (హిం.స),: చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా, సెంట్రల్ మిలిటరీ క
జిన్పింగ్కు మూడోసారీ పట్టం


,బీజింగ్ 9 నవంబర్ (హిం.స),: చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రధాన కార్యదర్శిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా, దేశాధ్యక్షుడిగా జీ జిన్పింగ్ (68) అసాధారణ రీతిలో మూడోసారి కూడా ఎన్నిక కానున్నారు. మావో జెడాంగ్ తర్వాత మూడుసార్లు పీఠమెక్కిన నేత లేకపోవడం గమనార్హం. జిన్పింగ్ ప్రస్తుతం రెండో దఫా అధికారంలో ఉన్నారు. వచ్చే ఏడాదితో పదవీకాలం పూర్తవుతుంది. ఆయనకు మూడో సారి పట్టం కట్టే విషయమై చర్చించేందుకు సీపీసీ సమావేశాలు సోమవారమిక్కడ ప్రారంభమయ్యాయి.

సీపీసీ ఏర్పాటై వందేళ్లు పూర్తయిన సందర్భంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చరిత్రాత్మక తీర్మానాన్ని కూడా ఆమోదించనున్నారు. ఏ నాయకుడూ రెండు సార్లకు మించి ఈ బాధ్యతలు చేపట్టరాదని.. 68 ఏళ్లు దాటిన పార్టీ నేతలంతా రిటైరవ్వాల్సిందేనని డెంగ్ జియావోపింగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిబంధనలు తెచ్చారు. అయితే మావో తర్వాత శక్తిమంతమైన నేతగా ఎదిగిన జిన్పింగ్ కోసం పార్టీ ఈ నిబంధనను మూడేళ్ల కిందటే తొలగించింది.

హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande