Custom Heading

ఫరూక్ నగర్, షాద్ నగర్ ప్రాంతాల్లో ఘనంగా అంబెడ్కర్ వర్ధంతి
తెలంగాణ:రంగా రెడ్డి :షాద్ నగర్:డిసెంబర్:6 (హిం.స)సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను రూపు మాపిన మహనీయు
ఫరూక్ నగర్, షాద్ నగర్ ప్రాంతాల్లో ఘనంగా అంబెడ్కర్ వర్ధంతి


తెలంగాణ:రంగా రెడ్డి :షాద్ నగర్:డిసెంబర్:6 (హిం.స)సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను రూపు మాపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తా, అదేవిధంగా ఫరూక్ నగర్ 10వ వార్డులో మైనార్టీ నాయకులు జమృత్ ఖాన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. భారతదేశంలో సమసమాజ స్థాపనకు ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేద్కర్ అని కీర్తించారు. అందరికీ ఆదర్శనీయమైన రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయులు, గొప్ప మేధావిగా అంబేద్కర్ ఈనాటికీ కీర్తింప బడుతున్నారన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే నేడు అనేకమంది ఉన్నత పదవులు అధిరోహించారన్నారు. అంబేద్కర్ ఆశయాలను, స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందన్నారు.

జనార్దన్ రెడ్డి :హిందూస్థాన్ సమాచార్


 rajesh pande