Custom Heading

బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా
తెలంగాణ:రంగా రెడ్డి:షాద్ నగర్:డిసెంబర్:6 (హిం.స) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు
బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా


తెలంగాణ:రంగా రెడ్డి:షాద్ నగర్:డిసెంబర్:6 (హిం.స) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వ్యాట్ తగ్గించాలంటూ పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్ రాష్ట్ర కార్యదర్శి నర్సింహారెడ్డి, జిల్లా ఇంచార్జ్ మల్లారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర సభ్యులు పటోళ్ల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపయ్య గౌడ్, శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ ను తగ్గించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

జనార్దన్ రెడ్డి :హిందూస్థాన్ సమాచార్:


 rajesh pande