మా సంస్థ గురించి
మా సంస్థ గురించి
హిందుస్తాన్ సమాచార్...ఇది భారతదేశంలో ఉన్న ఏకైక బ‌హుళ భాషా జాతీయ వార్తా సంస్థ. 10 ఏప్రిల్, 1948 న సహకార సంఘంగా ఈ సంస్థ స్థాపించబడింది. దీని జాతీయ ప్రధాన కార్యాలయం ఢిల్లీ లో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 22 బ్యూరోలు ఈసంస్థ‌లో పనిచేస్తున్నాయి. ప్రస్తుతం, హిందుస్థాన్ సమాచార్ యొక్క క‌మ్యూనికేష‌న్ నెట్ వ‌ర్క్ లు 600 ప్రదేశాలలో ఉన్నాయి, ఇవి తమ సేవలను 24 గంటలూ అందిస్తుంటాయి.
ఇలాంటి అత్య‌ద్భుత‌మైన నెట్ వ‌ర్క్ వ‌ల్ల దేశంలో అత్యధిక సభ్యత్వం ఉన్న వార్తా సంస్థలలో హిందుస్తాన్ సమాచార్ అగ్రస్థానంలో ఉంది. దినపత్రికలు, వారపత్రికలు, న్యూస్ పోర్టల్‌లు, న్యూస్ ఛానెల్‌లు ఇలా ఎన్నో వంద‌లాది వార్తా సంస్థ‌ల‌కు, మా వినియోగ‌దారులకు మా వార్తా సేవను అందిస్తున్నాము. వివిధ భారతీయ భాషలలో వార్తలను వేగంగా అందించడం మా నైపుణ్యం. అంతేకాదు హిందీ మరియు ఉర్దూతో పాటు, బంగ్లా, అస్సామీ, ఒడియా, మరాఠీ, గుజరాతీ, కన్నడ, తెలుగు, పంజాబీ, నేపాలీ మొదలైన ప్రాంతీయ భాష‌ల‌లోని వార్త‌ల‌ను కూడా వేగ‌వంతంగా అందించ‌డంలో ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తున్నాము. నేపాలి భాష‌లో ప్ర‌చురించ‌బ‌డే అనేక‌ప‌త్రిక‌లు మా వినియోగ‌దారులుగా ఉన్నాయి. దేశంలోని అతి పెద్ద ప్రసార ప్రఖ్యాత వార్తా ఛానెల్‌లైన "డీడీ న్యూస్'' మరియు ''ఆకాశవాణి "కి ఆరుభాష‌ల‌లో మా సేవ‌ల‌ను అందిస్తున్నాము.
వార్త‌ల‌ను పూర్తి ప్రామాణిక‌త‌తో అందించ‌డ‌మే మా ల‌క్ష్యం. దీనికోసం ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో ఒడిదొడుకుల‌ను, క‌ష్టాల‌ను సైతం ఎదుర్కున్న‌ప్ప‌టికీ...మేము మీడియా ప్ర‌పంచంలో స్థిరంగా నిల‌బ‌డిగ‌లిగాము. గ‌త 73 సంవ‌త్స‌రాలుగా మేము జ‌ర్న‌లిజం విలువ‌ల‌ను కాపాడుకుంటున్నాము అంతేకాదు దాన్ని ఎప్ప‌టికీ ఖ‌చ్చితంగా కొన‌సాగిస్తాము. అందుకే మా న్యూస్ ఏజెన్సీ విశ్వ‌స‌నీయ వార్తాసంస్థ‌గా ప్రామాణిక‌త సంత‌రించుకుంది.
మేము పాత్రికేయ విలువలతో పాటు ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచడంలో సాధ్యమైనంత వరకు మా వంతు పాత్ర పోషించాము . , ఇందిరాగాంధీ విధించిన ఎమెర్జీన్సీ స‌మ‌యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి హిందుస్థాన్ సమాచార్ నిర్వ‌హించిన నిర్భయమైన మరియు నిష్పాక్షికమైన జర్నలిజం కార‌ణంగా అప్ప‌టి పాల‌కుల‌కు కూడా మేం వ్య‌తిరేకుల‌మయ్యాము. ఎన్నో క‌ష్టాల‌ను భ‌రించాము. చివ‌రికి మేమే గెలిచాం..అప్ప‌టి మా గెలుపు స‌మ‌యం సువ‌ర్ణాక్ష‌రాల‌తో రాయ‌ద‌గిన‌ది. మాకు పాల‌కుల మెప్పు అవ‌స‌రం లేదు ...మా ల‌క్ష్యం మంచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించ‌డ‌మే...దానికోసం ఇప్ప‌టికి కూడా మేము కృషి చేస్తునే ఉన్నాం.
మా ఇతర సేవలు
హిందుస్తాన్ స‌మాచార్ వార్తా సంస్థ వార్తాకథనాలతో పాటూ, అనేక‌ర‌కాలైన ఫీచర్లు, ఫోటోలలాంటి సేవ‌ల‌ను కూడా అందిస్తుంది. ఇప్ప‌టి ఆధునిక సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని, మేము న్యూస్ స్కాన్ సేవను కూడా అందిస్తున్నాము. అంతేకాదు ప్ర‌తీ సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేక‌రించ‌డం ద్వారా చరిత్రను కోల్పోకుండా వాటిని భ‌ద్ర‌పరుచుకుంటున్నాం.
"య‌థావత్" అనేది హిందుస్తాన్ వార్తా సంస్థ‌ యొక్క హిందీ పక్షపత్రిక. ఈ పత్రిక విశేష‌మైన ప‌త్రికాద‌ర‌ణ పొందింది.. దీనితో పాటు "యుగ‌వార్త" (హిందీ వార‌ప‌త్రిక‌), "న‌వోత్తాన్" (హిందీ మరియు బెంగాలీ మాసపత్రిక) కూడా మా సంస్థ ద్వారా ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, "య‌థావ‌త్" అనే పత్రిక ప్రస్తుతం ప్రచురించబడుతోంది. ప్రతి సంవత్సరం భారతీయ నూతన సంవత్సరం (చైత్ర ప్రతిపద) సందర్భంగా, దైనందినిని (డైరీ) హిందూస్థాన్ సమాచార్ ప్రచురిస్తుంది, ఇందులో భారతీయ కాల‌మాన తిథులు మరియు ఆంగ్ల తేదీలు ఉన్నాయి. భారతీయ కాలమానం కావాలి అని అనుకునే వారికి ఈ దైనందిని చాలా ఉపయోగకరంగా ఉంటుంది,
మా వ్యవస్థాపకులు
పాశ్చాత్య ప్ర‌భావం అధిక‌మ‌వుతున్న ఈస‌మ‌యంలో భార‌తీయ ఆలోచ‌నలు పంచుకునేందుకు వేదిక అవ‌స‌ర‌మ‌ని త‌ల‌చి హిందుస్తాన్ స‌మాచార్ న్యూస్ ఏజెన్సీ సంస్థను స్థాపించారు.. కీర్తిశేషులు "శివరామ్ శంకర్ ఆప్టే", మొట్ట‌మొద‌టిసారిగా దేవనగరి లిపిలో "టెలిప్రింటర్"కనిపెట్టిన ఘనత వారికే దక్కుతుంది. వీరినే ప్రేమ‌గా దాదాసాహెబ్ ఆప్టేగా పిలుచుకుంటారు. హిందుస్తాన్ సమాచార్ నిర్వ‌హ‌ణ‌లో కీ.శే బాలేశ్వర్ అగర్వాల్ యొక్క పాత్ర అతి ముఖ్య‌మైన‌ది. భారతదేశంలోని ప్ర‌జానికానికి ఈ సంస్థ‌ను మ‌రింత ద‌గ్గ‌ర చేసేలా అత్యంత ప్రామానిక‌మైన‌, ప్ర‌సిద్ధ వార్తాసంస్థ‌గా వారు ఈ సంస్థ‌ను తీర్చిదిద్ద‌డంలో త‌మ క‌ర్త‌వ్యాన్ని నెర‌వేర్చారు.
అప్పుడు కొంద‌రు విద్రోహ శ‌క్తుల‌ను ఎదుర్కునే పోరాటంలో... హిందుస్తాన్ స‌మాచార్ త‌న ఉనికి కోసం పోరాడింది. అప్పుడు జాతి ప్రయోజనాల దృష్ట్యా కీ.శే శ్రీకాంత్ జోషి త‌మ జీవితాన్ని సైతం అంకితంచేసి, హిందుస్థాన్ సమాచార్ కు పున‌ర్జీవ‌నం పోశారు. హిందుస్తాన్ సమాచార్ వార్తాసంస్థ యొక్క ప్రాథమిక మంత్రం స‌త్యాన్నే చెప్ప‌డం..స‌త్యాన్నే మాట్లాడ‌డం..సేవా మ‌రియు స‌హాయాన్ని అందిచ‌డం..ఇదే మార్గంలో మేము నిరంత‌రం ప్ర‌యాణిస్తూనే ఉంటాము.....
 rajesh pande