Custom Heading

రాజీనామా చేయనున్న పంజాబ్ సీఎం
పంజాబ్, 18 సెప్టెంబర్ (హిం.స) అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకున్న
రాజీనామా చేయనున్న పంజాబ్ సీఎం


పంజాబ్, 18 సెప్టెంబర్ (హిం.స) అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకున్నది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తన పదవి రాజీనామా చేశారు. కాసేపటి క్రితం ఆయన పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ను కలిశారు. తనతో పాటు తన మంత్రిమండలి రాజీనామాలను గవర్నర్కు సమర్పించారు. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం మీడియా అడ్వైజర్ రవీణ్ తుక్రాల్ తెలిపారు. తన తండ్రి కెప్టెన్ అమరీందర్ రాజీనామా చేయనున్నట్లు ఆయన కుమారుడు రణిందర్ సింగ్ కొన్ని గంటల ముందు తన ట్విట్టర్లో వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల సీరియస్గా ఉన్న కెప్టెన్ అమరీందర్ తన సీఎం పదవికి గుడ్బై చెప్పనున్నట్లు తెలిసిందే. ఇలాంటి అవమానాలతో పార్టీలో కొనసాగలేనని సోనియా గాంధీతో ఆయన చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించేందుకు పార్టీ సమాయత్తమైన వేళ కెప్టెన్ అమరీందర్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ నివాసం ముందు అమరీందర్ మీడియాతో మాట్లాడారు. మూడవ సారి తనను అవమానించినట్లు ఆయన అన్నారు. రాజీనామా చేయాలని ఇవాళ ఉదయమే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ చీఫ్కు తన నిర్ణయాన్ని చెప్పినట్లు వెల్లడించారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande