Custom Heading

ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి నలుగురు పారా అథ్లెట్లు ఎన్నిక
న్యూఢిల్లీ, 19 సెప్టెంబర్ (హిం.స)పారా హైజంపర్ శరద్ కుమార్, షూటర్ మనీష్ నర్వాల్, షట్లర్ ప్రమోద్ భగత్
ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి నలుగురు పారా అథ్లెట్లు ఎన్నిక


న్యూఢిల్లీ, 19 సెప్టెంబర్ (హిం.స)పారా హైజంపర్ శరద్ కుమార్, షూటర్ మనీష్ నర్వాల్, షట్లర్ ప్రమోద్ భగత్, జావెలిన్ త్రోయర్ సుందర్ సింగ్ గుర్జార్ పేర్లను ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం ధ్యాన్చంద్ ఖేల్ రత్నకు సిఫారసు చేసినట్టు భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) ప్రకటించింది. ఈ నలుగురు టోక్యోలో జరిగిన పారాలింపిక్స్లో పతకాలు సాధించి మువ్వన్నెలను రెపరెపలాడించారు. అవార్డులకు ఎంపిక చేయడం వల్ల వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పీసీఐ అధ్యక్షురాలు దీపా మాలిక్ పేర్కొన్నారు. టోక్యోలోనే మెరిసిన జావెలిన్ త్రోయర్ సుమీత్ అంటిల్, షూటర్ అవని లేఖారా పేర్లను అర్జున అవార్డుకు నామినేట్ చేసినట్టు తెలిపారు. పారాలింపిక్స్లో పతకాలు సాధించిన అథెట్లను క్రీడాపురస్కారాలతో సత్కరిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గతనెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande