ఐపీఎల్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లీ
ఢిల్లీ, 20 సెప్టెంబర్ (హిం.స)రోజుల వ్యవధిలోనే తన అభిమానులకు రెండు పెద్ద షాకులు ఇచ్చాడు విరాట్ కోహ్ల
ఐపీఎల్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లీ


ఢిల్లీ, 20 సెప్టెంబర్ (హిం.స)రోజుల వ్యవధిలోనే తన అభిమానులకు రెండు పెద్ద షాకులు ఇచ్చాడు విరాట్ కోహ్లి. మొదట టీమిండియా టీ20 కెప్టెన్సీకి వరల్డ్కప్ తర్వాత గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కూడా దిగిపోతున్నానని, కెప్టెన్గా ఇదే తన చివరి సీజన్ అని ఓ వీడియో సందేశాన్ని అతడు రిలీజ్ చేశాడు. ఐపీఎల్లో ఆడినంత వరకూ ఓ ప్లేయర్గా ఆర్సీబీతోనే ఉంటానని కూడా అతడు స్పష్టం చేశాడు. 9 ఏళ్లుగా ఆర్సీబీ కెప్టెన్గా ఉన్న విరాట్.. ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించి పెట్టలేకపోయాడన్న అపవాదును మూటగట్టుకున్నాడు.

ఈ నేపథ్యంలో విరాట్ ఇలా సడెన్గా కెప్టెన్సీకి గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించడం అభిమానులను షాక్కు గురి చేసింది. పని భారాన్ని తగ్గించుకోవడం కోసమే తాను టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిన కోహ్లి.. ఆర్సీబీ కెప్టెన్సీని వదులుకోవడంపై స్పష్టమైన కారణం ఇవ్వలేదు. అయితే ఈ వీడియోలో మాట్లాడుతూ అతడు కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. ఈ రెండు నిమిషాల వీడియోలో కోహ్లి నవ్వుతూ కనిపించినా.. అతని కళ్లలో బాధ స్పష్టంగా కనిపించింది.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande