వివాదంలోకి మన్యవార్ యాడ్
న్యూఢిల్లీ, 23 సెప్టెంబర్ (హిం.స)ఇప్పుడు సినిమాలే కాదు యాడ్స్ కూడా వివాదాలలో నిలుస్తున్నాయి. ఆ మధ్య
వివాదంలోకి మన్యవార్ యాడ్


న్యూఢిల్లీ, 23 సెప్టెంబర్ (హిం.స)ఇప్పుడు సినిమాలే కాదు యాడ్స్ కూడా వివాదాలలో నిలుస్తున్నాయి. ఆ మధ్య జ్యుయలరీ బ్రాండ్ ‘తనిష్క్‘.. హిందూముస్లిమ్ మతాంతర వివాహం నేపథ్యంలో యాడ్ రూపొందించి అనేక విమర్శల పాలైంది. తాజగా మాన్యవర్ యాడ్లో నటించగా, ఇందులోకన్యాదానం గురించి మాట్లాడిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

యాడ్లో అలియా భట్… నా కుటుంబ నన్ను ఎంతగానో ప్రేమించిందని అని చెబుతూ… ‘నేనేమైనా వస్తువునా దానం చేయడానికి! కన్యాదానమే ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ ఇప్పటినుంచి దీన్ని కన్యామాన్(గౌరవంతో పంపించడం)గా మార్చుదాం.. అని చెప్పుకొచ్చింది. దర్శకుడు అభిషేక్ వర్మన్ డైరెక్ట్ చేసిన ఈ యాడ్ రిలీజైనప్పటి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది

ఈ యాడ్పై మండపడ్డ కంగనా.. దేశ సరిహద్దులో జవాను చనిపోతే ఆ అమరవీరుడి తండ్రి.. చింతించకండి, నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు. అతడిని దేశ రక్షణ కోసం దానం చేస్తాను, అది కన్యాదానం అయినా ‘పుత్రదానం’ అయినా సరే! అంటూ గొప్పగా మాట్లాడే మాటలను మనం తరచూ టీవీలో చూస్తూనే ఉన్నాం. దానాన్ని సమాజం చిన్నచూపు చూస్తుందో అప్పుడు రామరాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని గుర్తించాలి.హిందువులను, హిందూ ఆచారాలను కించపరచడం ఇకనైనా ఆపండి అంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande