హత్య కేసులో వారు నిర్దోషులు: బ్రిటన్ కోర్టు
లండన్, 23 సెప్టెంబర్ (హిం.స): ఆర్ఎస్ఎస్ కార్యకర్త రూల్దా సింగ్ హత్య కేసులో బ్రిటన్లో అరెస్టయిన ముగ్
హత్య కేసులో వారు నిర్దోషులు: బ్రిటన్ కోర్టు


లండన్, 23 సెప్టెంబర్ (హిం.స): ఆర్ఎస్ఎస్ కార్యకర్త రూల్దా సింగ్ హత్య కేసులో బ్రిటన్లో అరెస్టయిన ముగ్గురు బ్రిటీష్ సిక్కులను బ్రిటన్కు చెందిన ఒక కోర్టు నిర్దోషులుగా లేల్చిచెప్పింది. 12 ఏళ్ల క్రితం భారత్లోని పటియాలాలో ఆర్ఎస్ఎస్ నేత రూల్దా సింగ్ హత్య జరిగింది. ఈ ఉదంతంలో అరెస్టయిన ముగ్గురిని అప్పగించే విషయంలో తగిన ఆధారాలు చూపనందున బ్రిటన్కు చెందిన కోర్టు భారత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

పియారా సింగ్ గిల్, అమృత్వీర్ సింగ్ వహీవాలా, గురుశరణ్వీర్ సింగ్ వహీవాలాలను గత ఏడాది డిసెంబర్లో వెస్ట్ మిడ్ల్యాండ్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2009లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత రూల్దా సింగ్ హత్య కేసులో ప్రమేయముందంటూ ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. పాటియాలాలో రూల్దా సింగ్పై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రూల్దా సింగ్ చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత మృతి చెందారు. లండన్లోని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి మైఖేల్ స్నోఈ కేసును విచారించారు.

హిందూస్తాన్ సమాచార్ నాగరాజు రావు, సంతోషలక్ష్మి


 rajesh pande