కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికోసం ఆరులక్షల తెల్ల జండాలు
అమెరికా, 24 సెప్టెంబర్ (హిం.స)కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించేందుకు వాష
కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికోసం ఆరులక్షల తెల్ల జండాలు


అమెరికా, 24 సెప్టెంబర్ (హిం.స)కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించేందుకు వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మైదానంలో తమ వారి కోసం ప్రత్యేక మెసేజ్ రాసి వుంచిన తెల్ల జెండాలను ప్రదర్శించే వీలున్నది. వచ్చే నెల 3 వరకు ఇక్కడ తెల్ల జెండాలు ప్రదర్శించేందుకు అనుమతించనున్నారు.

కొవిడ్ -19 బాధితుల జ్ఞాపకార్థం వాషింగ్టన్ డీసీలోని 20 ఎకరాల నేషనల్ హాల్ మైదానంలో పెద్ద సంఖ్యలో తెల్ల జెండాలు వెలిశాయి. తమ వారికి నివాళులర్పించేందుకు రెండు వారాలపాటు ఈ ప్రత్యేకమైన స్మారక చిహ్నం వద్ద తెల్ల జెండాలు ప్రదర్శించనున్నారు. ఇది మహమ్మారి కారణంగా కోల్పోయిన విలువైన జీవితాలను గుర్తు చేయనున్నది. ప్రత్యేక మెసేజ్తో కూడిన తెల్ల జెండాలను ప్రదర్శించేందుకు వచ్చే నెల 3 వ తేదీ వరకు ఇక్కడ అనుమతిస్తారు.

ఈ కార్యక్రమ కాన్సెప్ట్ను ఆర్టిస్ట్ సుజానే బ్రెన్నాన్ ఫిర్స్టెన్బర్గ్ తయారు చేశారు. సుజానే బ్రెన్నాన్ సోషల్ యాక్షన్ ఆర్టిస్ట్. తన వాలంటీర్ల బృందంతో కలిసి సుజానే బ్రెన్నాన్ ఈ జెండాలను ఏర్పాటు చేయడానికి 2,000 గంటల పాటు పని చేసినట్లు తెలుస్తున్నది. అమెరికాలో కొవిడ్ మరణాలను లెక్కించడానికి ఈ కళాకారుడు ప్రతిరోజూ జెండాలను జోడిస్తూ వస్తున్నాడు.

3.8 మైళ్ల పొడవు ఫుట్పాత్ ఉన్న ఈ ఇన్స్టాలేషన్ వద్ద ప్రాణాలు కోల్పోయిన తమ ప్రియమైన వారికి నివాళులు అర్పించేలా ఏర్పాట్లు కూడా చేశారు. స్మారక చిహ్నానికి వ్యక్తిగతంగా హాజరుకాలేని వారు తమ సంస్మరణలను అధికారిక వెబ్సైట్ www.inamericaflags.org ద్వారా కూడా పంపవచ్చునని నిర్వాహకులు సూచిస్తున్నారు. 1987 అనంతరం ఇదే అతి పెద్ద స్మారక కేంద్రంగా మారనున్నదని ఇక్కడి వారు చెప్తున్నారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande