Custom Heading

భార్యాభర్తల మధ్య గొడవ....పసికందు మృతి
తెలంగాణ : హైదరాబాద్: సెప్టెంబర్ 25 ( హింస) భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ పసికందు ప్రాణం తీసింది.ఈ
భార్యాభర్తల మధ్య గొడవ....పసికందు మృతి


తెలంగాణ : హైదరాబాద్: సెప్టెంబర్ 25 ( హింస)

భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ పసికందు ప్రాణం తీసింది.ఈ దారుణం సైదాబాద్ పరిధి పూసల బస్తీలో చోటు చేసుకుంది. పూసల బస్తీలో రాజేష్, జాహ్నవి దంపతులు నివాసముంటున్నారు. వారికి ఇటీవలే(22 రోజుల క్రితం) శిశువు జన్మించింది. భర్త రాజేష్ తన భార్య జాహ్నవిపై ప్లాస్టిక్ పైప్తో దాడికి పాల్పడ్డాడు. దాడి నుంచి తప్పించుకునేందుకు తల్లి జాహ్నవి శిశువును అడ్డుపెట్టింది. ఈ క్రమంలోనే తనను తాను రక్షించుకునే క్రమంలో శిశువు గొంతును జాహ్నవి గట్టిగా పట్టుకుంది. దీంతో పసికందు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ పసికందు మృతి చెందింది. రాజేష్, జాహ్నవిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande