Custom Heading

అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్'
న్యూఢిల్లీ:, 25 సెప్టెంబర్ (హిం.స)ఈ-కామర్స్ దిగ్గజాలు.. వినియోగదారుల మోముల్లో పండగ కళ తెచ్చేందుకు
అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్'


న్యూఢిల్లీ:, 25 సెప్టెంబర్ (హిం.స)ఈ-కామర్స్ దిగ్గజాలు.. వినియోగదారుల మోముల్లో పండగ కళ తెచ్చేందుకు సమాయత్తం అవుతున్నాయి. అక్టోబరు మొదటి వారంలో మూడు షాపింగ్ ఫెస్టివల్స్ ప్రారంభం కాబోతున్నాయి. 4 నుంచి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, 3వ తేదీ నుంచి మింత్రా ‘బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ ప్రారంభించనున్నట్టు ప్రకటించాయి. మరోపక్క ఫ్లిప్కార్ట్ ‘ద బిగ్ బిలియన్ డేస్’ విక్రయాలు అక్టోబరు 7 నుంచి 12వరకు నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ విక్రయాలు సుమారు నెల రోజుల పాటు జరుగుతాయి. సామ్సంగ్, వన్ ప్లస్, షామీ, లెవీస్ వంటి బ్రాండ్లు వెయ్యి వరకు కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టనున్నాయి

హిందూస్తాన్ సమాచార్ ,నాగరాజ్


 rajesh pande