సమాజంలో సమరసత భావాన్ని పెంపొందించిన కవులు చిరస్మరణీయులు.
తెలంగాణ/జగిత్యాల/సెప్టెంబర్,25(హిం.స) తమ రచనల ద్వారా సమాజంలో సామరస్య భావాన్ని పెంపొందించేందుకు కృషి
Pandit Deendayal Upadhyay dedicated his life for nation building


తెలంగాణ/జగిత్యాల/సెప్టెంబర్,25(హిం.స) తమ రచనల ద్వారా సమాజంలో సామరస్య భావాన్ని పెంపొందించేందుకు కృషి చేసిన కవులు చిరస్మరణీయులని సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. ప్రముఖ కవులు దున్న ఇద్దాసు , బోయి భీమన్న , గుర్రం జాషువా జయంతి ఉత్సవాల సందర్భంగా సమరసత - జాతీయత పై విద్యావంతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ పాల్గొన్నారు.

ప్రముఖ కవులు దున్న ఇద్దాసు , బోయి భీమన్న , గుర్రం జాషువాలు

జాతిని సమైఖ్య పరిచారనీ..వారి జయంత్యుత్సవాలను జరిపి సమరసత భావాల వ్యాప్తికి ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని అప్పాల ప్రసాద్ అన్నారు.

స్థానిక ధరూర్ క్యాంపు లోని గీతాభవనములో ప్రముఖ కవులు దున్న ఇద్దాసు , బోయి భీమన్న , గుర్రం జాషువా జయంతి ఉత్సవాల

సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ ప్రధాన వక్తగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సమరసతా వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కనికరపు లచ్చన్నతో పాటు వార్డు కౌన్సిలర్ గుర్రం రాము, సభ్యులు ఎన్నమనేని అశోక్ రావు మరియు పలువురు మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంలో అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ...

అన్ని వర్గాల మధ్య సమరసత మరియు జాతీయ భావన నింపి , దళితుల హృదయాలలో స్వాభిమానాన్ని మేలుకొల్పి , సమకాలీన సమాజంలో గౌరవానికి అర్హులయ్యేట్లు కృషిచేసిన వారిగా దున్న ఇద్దాసు , బోయి భీమన్న , గుర్రంజాషువా పేరెన్నికగన్నారన్ననరు.

వేల సంవత్సరాల దాడులు , దండయాత్రల తర్వాత కూడా నేటికి సజీవమైన జాతీయ జీవశక్తిగా మనదేశం వెలుగొందుతున్నదన్నారు.

అయితే ఈ 1500 సంవత్సరాల కాలక్రమంలో ఎన్నో దురాచారాలు , వికృతులు ప్రవేశించి ఈ జీవశక్తిని బలహీనం చేస్తున్న సందర్భంలో సంఘ సంస్కర్తలుగా , జాతీయ వాదులుగా ఈ ముగ్గురు జన్మించి జాతిని సమైఖ్య పరిచారన్నారు . వీరి జయంత్యుత్సవాలను జరిపి సమరసత భావాల వ్యాప్తికి సమాజంలోని ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు.

సంపూర్ణా చారి,జగిత్యాల, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande