ఆటో-డెబిట్ లావాదేవీలపై కొత్త రూల్స్
ముంబై, 25 సెప్టెంబర్ (హిం.స)ఆటో-డెబిట్ రూల్స్ వచ్చే నెల నుంచి మారే అవకాశం ఉంది. డెబిట్ కార్డులు, క్
ఆటో-డెబిట్ లావాదేవీలపై కొత్త రూల్స్


ముంబై, 25 సెప్టెంబర్ (హిం.స)ఆటో-డెబిట్ రూల్స్ వచ్చే నెల నుంచి మారే అవకాశం ఉంది. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) లేదా ఇతర ముందస్తు(ప్రీపెయిడ్) చెల్లింపు సాధనాల ద్వారా చేసే పునరావృత లావాదేవీలకు ఎడిషనల్ ఫ్యాక్టర్ అథంటికేషన్(ఏఎఫ్ఏ) అవసరమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గతంలో పేర్కొంది.

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు చేసే వారి సంఖ్య పెరిగింది. విద్యుత్ బిల్లు దగ్గర నుంచి గ్యాస్ బిల్లు వరకు నెలవారిగా చెల్లించాల్సిన బిల్లులు వాయిదాలు చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులు ఆటో-డెబిట్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఈ కొత్త నిబంధనలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ.. వినియోగదారుల సౌకర్యార్థం సెప్టెంబరు 30 వరకు పాత పద్ధతిలోనే చెల్లింపులు చేసేందుకు ఆర్బీఐ అనుమతించింది.

హిందూస్తాన్ సమాచార్,నాగరాజ్


 rajesh pande