పోలీస్ స్టేషన్ లోని సెక్షన్ ఇంచార్జ్ అధికారులకు దూర దృశ్య సమీక్ష ద్వారా ఒకరోజు శిక్షణా కార్యక్రమం
తెలంగాణ :నారాయణపేట జిల్లా : సెప్టెంబర్25( హింస ) *పోలీస్ స్టేషన్ లోని సెక్షన్ ఇంచార్జ్ అధికారులకు ద
*పోలీస్ స్టేషన్ లోని సెక్షన్ ఇంచార్జ్ అధికారులకు దూర దృశ్య సమీక్ష ద్వారా ఒకరోజు శిక్షణా కార్యక్రమం


తెలంగాణ :నారాయణపేట జిల్లా : సెప్టెంబర్25( హింస )

*పోలీస్ స్టేషన్ లోని సెక్షన్ ఇంచార్జ్ అధికారులకు దూర దృశ్య సమీక్ష ద్వారా ఒకరోజు శిక్షణా కార్యక్రమం*

జిల్లా *ఎస్పీ డాక్టర్ చేతన ఐపిఎస్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా లోని పోలీస్ స్టేషన్ లో ఉన్న సెక్షన్ ఇన్చార్జ్ లకు వర్టికల్ ఇన్ఛార్జ్ ఎస్సై. MD. నాసర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ. గారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నందు సెక్షన్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించే అధికారి స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, ప్రజలు మరియు వివిధ వ్యవస్థల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి అన్ని సమయ సందర్భాలు స్టేషన్ SHO గారి తో,అందరూ అధికారులు యొక్క విధులు మధ్య సమన్వయం సాధిస్తూ తగు చర్యలు తీసుకుని శాంతిభద్రతలు కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తారు. అంతేకాకుండా SHO గారి సూచనల మేరకు పరిస్థితులకు అనుగుణంగా విధుల విభజన స్టేషన్ నిర్వహణ వంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ నిరంతరం మరియు తక్షణం ప్రజలకు సేవలు అందించుటకు అనువైన వాతావరణం పోలీస్ స్టేషన్ నందు ఉండునట్లు చేసి పోలీస్ వ్యవస్థ పై బాధితులకు, ఫిర్యాదు దారులకు మరియు ప్రజల విశ్వాసం పెంపొందించేందుకు తోడ్పడతారు.

పోలీస్ స్టేషన్ నందు సెక్షన్ ఇన్చార్జ్ విధులు మరియు బాధ్యతలు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా సంబంధిత సిబ్బందిని పర్యవేక్షించి తగు చర్యలు తీసుకొనవలెను, పోలీస్ స్టేషన్లు ప్రతి వర్టికల్ లో 5 s విధానం ఉండే విధంగా చూడాలి. వివిధ వర్టికల్ అధికారులు మరియు సిబ్బంది మధ్య సమన్వయం చేస్తూ విధులు నిర్వహించాలి. స్టేషన్ పరిధిలోని బిట్లు, పెట్రోల్ కార్స్, బ్లూ కోర్స్ అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సూచనలు చేయవలెను. రిసెప్షన్ అధికారికి అవసరమైనప్పుడు సహాయపడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సరైన సౌకర్యాలు కల్పించి వారికి న్యాయం జరుగుతుందని వారిపై సానుభూతి దృక్పథంతో వారి సమస్యలు పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. స్టేషన్ లో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ VHF. సెట్ ఫోన్ కు బాధ్యత వహించాలి అందరితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. స్టేషన్ లో లాకప్, స్టేషన్ వాచ్, మరియు స్టేషన్ గార్డ్ కు బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండాలి. ప్రతిరోజు విధులకు హాజరయ్యే సిబ్బందికి క్రమం తప్పకుండా రోల్ కాల్ నిర్వహిస్తూ వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ నందు గల పనులను ప్రాధాన్యతలను బట్టి పరిమిత వనరులతో గరిష్ట ప్రయోజనాలు చేకూరే విధంగా SHO గారి సూచనలను అనుసరించి సిబ్బందికి విధులు కేటాయించాలి. డయల్ 100 నుండి వచ్చే ఫిర్యాదును తక్షణమే స్పందించి అవసరమైన తగిన చర్యలు తీసుకుని క్రైమ్ సిబ్బంది, బ్లూ కో ట్స్, పెట్రోల్ కార్స్ లకు సూచనలు అందించి త్వరితగతిన సంఘటన స్థలానికి చేరుకు నీ బాధితులకు న్యాయం చేకూర్చేలా చూడాలి. సెక్షన్ ఇన్చార్జి అధికారి పోలీస్ అధికారులు, సహోద్యోగులు, ప్రజలు, వివిధ ఆఫీస్ అధికారులతో, కంట్రోల్ రూమ్, డయల్ 100,108,104 మరియు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

దేవరి సతీష్ : నారాయణపేట జిల్లా : హిందుస్థాన్ సమాచార్


 rajesh pande