యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటి
ముంబై:, 25 సెప్టెంబర్ (హిం.స)యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని ర
యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటి


ముంబై:, 25 సెప్టెంబర్ (హిం.స)యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లే అన్నింటికీ ఉండాలి. అంతేకాదు కొత్త ఫోన్గానీ, డివైజ్గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు.

డివైజ్ కొన్న ప్రతీసారి కొత్త ఛార్జర్లు ఇస్తుంటాయి తయారీ కంపెనీలు. ఈ క్రమంలో పాత ఛార్జర్లనే ఉపయోగించే విధంగా యూజర్లను ప్రోత్సహించాలన్నది, రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. ఈ అంశంపై పదేళ్లుగా పోరాటం, చర్చలు నడుస్తున్నాయి అక్కడ. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. ఒకవేళ యూరోపియన్ కమిషన్ నిర్ణయం గనుక అమలు అయితే యూజర్లు ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయల) ఖర్చు పెట్టడం తగ్గుతుంది.

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande