Custom Heading

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
తెలంగాణ, 28 సెప్టెంబర్ (హిం.స) ఆగి ఉన్న కంటైనర్ను వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెంది
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం


తెలంగాణ, 28 సెప్టెంబర్ (హిం.స) ఆగి ఉన్న కంటైనర్ను వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం మజీద్పుర్- తుర్కపల్లి గ్రామాల మధ్య చోటు చేసుకుంది. శామీర్పేట ఎస్సై వీరశేఖర్, బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్(35), అదే గ్రామానికి చెందిన కారు డ్రైవర్ రాజేందర్(35), ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన వంశీ(22) శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. సుదర్శన్ తండ్రి దుబాయ్ వెళ్తుండగా అతడికి వీడ్కోలు పలికేందుకు వచ్చిన వీరు తిరుగు పయనమైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనలో సుదర్శన్, రాజేందర్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వంశీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande