పింక్ టెస్టులో అదరగొడుతున్న అమ్మాయిలు
ఆస్ట్రేలియా, 30 సెప్టెంబర్ (హిం.స) ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియాతో తాము ఆడుతున్న తొలి
పింక్ టెస్టులో అదరగొడుతున్న అమ్మాయిలు


ఆస్ట్రేలియా, 30 సెప్టెంబర్ (హిం.స) ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియాతో తాము ఆడుతున్న తొలి డేనైట్ టెస్ట్లోనే అదరగొడుతోంది. గురువారం ప్రారంభమైన ఈ టెస్ట్లో తొలి రోజు తొలి సెషన్లో భారత మహిళల జట్టు వికెట్ నష్టపోయి 101 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మందానా హాఫ్ సెంచరీ చేయడం విశేషం. డిన్నర్ సమయానికి ఆమె 64 పరుగులతో అజేయంగా నిలిచింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(31)తో కలిసి తొలి వికెట్కు 93 పరుగులు జోడించింది స్మృతి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకూ 112 బంతుల్లో 64 పరుగులు చేసిన స్మృతి 13 బౌండరీలు బాదడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రికార్డు చేజింగ్తో వాళ్ల 26 వరుస విజయాల రికార్డుకు బ్రేక్ వేసిన ఇండియన్ వుమెన్స్ టీమ్.. ఈ ఏకైక టెస్ట్లోనూ అదే ఊపు కొనసాగిస్తోంది.

హిందూస్తాన్ సమాచార్ సంతోషలక్ష్మి


 rajesh pande