Custom Heading

మూడో డోసు తర్వాత నాలుగు నెలలు యాంటీబాడీలు.
దిల్లీ:, 26 జనవరి (హిం.స) కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకొన్న వారిలో వైరస్ను అడ్డుకోగల యాంటీబాడ
మూడో డోసు తర్వాత నాలుగు నెలలు యాంటీబాడీలు.


దిల్లీ:, 26 జనవరి (హిం.స) కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకొన్న వారిలో వైరస్ను అడ్డుకోగల యాంటీబాడీలు నాలుగు నెలలపాటు స్థిరంగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలో ఫైజర్-బయోఎన్టెక్ టీకా బూస్టర్ డోసు తీసుకొన్న వారిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ పరిశోధన ఫలితాలను ఇంకా పీర్ రివ్యూ చేయలేదు. ఇప్పటికైతే నాలుగో షాట్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

టెక్సాస్ యూనివర్శిటీ వైద్య విభాగానికి చెందిన పెయ్ యాంగ్ షీ.. టీకాలు తీసుకొన్న వారి రక్త నమూనాలను పరీక్షించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇది పూర్తిగా కొత్త. బూస్టర్ డోస్ తీసుకొన్న వారిలో దాదాపు మూడు నెలల పాటు యాంటీబాడీలు ఉంటున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ను ఇవి గణనీయంగా అడ్డుకొంటున్నాయి’’ అని వెల్లడించారు.

హిందూస్తాన్ సమాచార్---/ నాగరాజ్


 rajesh pande