Custom Heading

గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ సంస్థ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు:విదేశీ విరాళాల అనుమతులపై'
దిల్లీ:, 26 జనవరి (హిం.స) విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) పరిధిలోని లైసెన్సులను కొనసాగిస్
గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ సంస్థ వ్యవస్థాపకుడు  కె.ఎ.పాల్ వినతిని తిరస్కరించిన సుప్రీంకోర్టు:విదేశీ విరాళాల అనుమతులపై'


దిల్లీ:, 26 జనవరి (హిం.స) విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) పరిధిలోని లైసెన్సులను కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ సంస్థ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఈ అంశంపై ఏవైనా సూచనలు ఉంటే పిటిషనర్ సంబంధిత అధికారులను సంప్రదించాలని, అవి సమంజసంగా ఉంటే అధికారులు పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ సి.టి.రవికుమార్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

‘‘2021 సెప్టెంబరు 30వ తేదీ వరకు ఎఫ్సీఆర్ఏ అనుమతులు ఉన్న సంస్థలన్నింటికీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకూ లైసెన్సులు పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ కోరారు.

గడువు తేదీ లోగా లైసెన్సుల పునరుద్ధరణ కోసం 11,594 స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని, వాటి రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం పొడిగించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అనుకోవడంలేదు. ఒకవేళ పిటిషనర్లకు ఏవైనా అభ్యంతరాలుంటే అధికారులకు వినతిపత్రం సమర్పించుకోవచ్చు’’ అని ధర్మాసనం మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande