ఇండోనేషియా ప్రధాన ద్వీపం పశ్చిమ జవా ప్రావిన్స్ లో భారీ భూకంపం
పశ్చిమ జవా 22నవంబర్ (హిం.స) ఇండోనేషియా లోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారంనాడు భ
ఇండోనేషియా ప్రధాన ద్వీపం పశ్చిమ జవా ప్రావిన్స్ లో భారీ భూకంపం


పశ్చిమ జవా 22నవంబర్ (హిం.స) ఇండోనేషియా లోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లో సోమవారంనాడు భారీ భూకంపం సంభవించింది.

భూకంపం ధాటికి 20 మంది మృతి చెందగా, సుమారు 300 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది.

వెస్ట్ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో డజన్ల కొద్ది ఇళ్లు, భవంతులు దెబ్బతిన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. గ్రేటర్ జకార్తా ప్రాంతంలో తీవ్రంగా భూప్రకంపనలు వచ్చినట్టు చెబుతున్నారు. రాజధానిలోని ఆకాశహర్మ్యాలు సుమారు మూడు నిమిషాల పాటు ఊగిపోయినట్టు చెబుతున్నారు. జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. కూలిన భవంతుల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు ముమ్మరంగా చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

హిందూస్తాన్ సమాచార,నాగరాజ్


 rajesh pande