ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ నాయకుల మహాధర్నా
తెలంగాణ: వరంగల్: నవంబర్ 30 (హిం.స) వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దు స
ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ నాయకుల మహాధర్నా


తెలంగాణ: వరంగల్: నవంబర్ 30 (హిం.స) వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.... ధరణి పోర్టల్ రద్దు చేయాలని ధరణి వల్ల రైతుల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి పోర్టలు రద్దు చేయడం జరుగుతుందని అదేవిధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేయడం జరుగుతుందన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం నిరసన కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొని నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande