కామారెడ్డిలో నాటు తుపాకులు పట్టివేత
తెలంగాణ : హైదరాబాద్ : నవంబర్30( హిం స) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సంగీతం గ్రామంలో నాటు తుపా
.....


తెలంగాణ : హైదరాబాద్ : నవంబర్30( హిం స)

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సంగీతం గ్రామంలో నాటు తుపాకుల కలకలం రేపాయి. సంతోష్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వెళ్లారు. తనికీలు చేసిన అధికారులకు షాక్ తిన్నారు. ఆప్రాంతంలో.. పలు గంజాయి మొక్కతో పాటు ,రెండు నాటు తుపాకులు పట్టుబడ్డాయి. ఇంట్లోనే నాటు తుపాకులు తయారు చేయడమే కాకుండా.. జంతువులు వేలకు ఉపయోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఎక్సైజ్ అధికారులు నిందితున్ని అదుపులో తీసుకుని బాన్సువాడ పోలీసులకు అప్పగించారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande