మహారాష్ట్రలో 700 దాటిన మీజిల్స్ కేసుల సంఖ్య
ఢిల్లీ : నవంబర్30( హిం స) ముంబైలో మంగళవారం కొత్తగా మరో 5 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. ఒక అనుమానాస్
....


ఢిల్లీ : నవంబర్30( హిం స) ముంబైలో మంగళవారం కొత్తగా మరో 5 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. ఒక అనుమానాస్పద మరణం చోటు చేసుకుంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 717 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఒక్క ముంబై నగరంలోనే 303 కేసులు నమోదు అయ్యాయి. వారంలో ఐదు అనుమానిత కేసులు ఉంటే..వాటిలో రెండు ప్రయోగశాలలో నిర్థారణ అయితే వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లుగా గుర్తిస్తారు. జనవరి నుంచి నాసిక్ జిల్లాలోని మాలేగావ్ లో 70 , ముంబై నగరంలోని భీవండీలో 48 మీజిల్స్ కేసులు నమోదు అయ్యాయి.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande