రేపటి నుంచి మార్కెట్లోకి డిజిటల్ రూపాయి
ఢిల్లీ : నవంబర్30( హిం స) రేపటి నుంచి మార్కెట్లోకి డిజిటల్ రూపాయి అందుబాటులోకి వస్తోందని ఆర్బీఐ వెల
....


ఢిల్లీ : నవంబర్30( హిం స) రేపటి నుంచి మార్కెట్లోకి డిజిటల్ రూపాయి అందుబాటులోకి వస్తోందని ఆర్బీఐ వెల్లడించింది. ఈ డిజిటల్ రూపాయి కోసం ఆర్బీఐ.. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్లోని ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, యస్ బ్యాంక్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిని ‘ఈ-రూపాయి’గా కూడా వ్యవహరిస్తారు. అయితే.. ఇది తొలుత కస్టమర్లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ)కు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande