ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
ఢిల్లీ : నవంబర్30( హిం స) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉ
...


ఢిల్లీ : నవంబర్30( హిం స) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 81 పాయింట్ల లాభంతో 62,762 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు ఎగబాకి 18,654 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.58 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్ఎం, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, రిలయన్స్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande