లక్నో-బహ్రాయిచ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
ఢిల్లీ : నవంబర్30( హిం స) లక్నో-బహ్రాయిచ్ హైవేపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహ్రాయిచ్
....


ఢిల్లీ : నవంబర్30( హిం స) లక్నో-బహ్రాయిచ్ హైవేపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహ్రాయిచ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన భారీ ట్రక్.. బస్సును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande