లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి
తెలంగాణ: జనగామ: నవంబర్ 30 (హిం.స) జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రఘ
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి


తెలంగాణ: జనగామ: నవంబర్ 30 (హిం.స) జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రఘునాథపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఇదే గ్రామ పంచాయతీకి చెందిన పేర్ని మల్లేష్ ఇంటి అనుమతుల కు సంబంధించి మ్యుటేషన్ చేసే విషయంలో భాగంగా రఘునాథపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోష్ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడని, అందులో భాగంగా 4 వేల 5 వందల రూపాయలు బాధితుడి పంచాయతీ కార్యదర్శి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారని వివరించారు.

ఏసీబీ వరంగల్ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో గ్రామపంచాయతీ కార్యాలయంలోనే సదరు కార్యదర్శి ని వల పన్ని, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని తో పాటు ఇదే గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది నగేష్ ను కూడా అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు.

సంపత్ రావు, హిందుస్తాన్ సమాచార.


 rajesh pande