సీఎం పర్యటన విజయవంతం చేయాలి.
జగిత్యాల/డిసెంబర్,04(హిం.స)ఈ నెల 7 న సీఎం జగిత్యాల పట్టణ పర్యటనను విజయవంతం చేయాలనీ మంత్రి తన్నీరు హ
సీఎం పర్యటన విజయవంతం చేయాలి.


జగిత్యాల/డిసెంబర్,04(హిం.స)ఈ నెల 7 న సీఎం జగిత్యాల పట్టణ పర్యటనను విజయవంతం చేయాలనీ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ లు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ వసంత, స్థానిక శాసన సభ్యులు డా సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధు శర్మ లతో పర్యటన ఏర్పాట్ల పై ప్రభుత్వ శాఖల అధికారులతో ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హల్ నందు సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ...

సిఎం పర్యటన ప్రభుత్వ శాఖలు తమకు అప్పగించిన బాధ్యతలను చిత్త శుద్దితో నిర్వర్తించాలనీ అన్నారు.

ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.

ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

సిఎం పర్యటన పూర్తి అయ్యే వరకూ విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్ కో అధికారులు చూడాలన్నారు. కార్యక్రమంకు హాజరయ్యే ప్రజా ప్రతినిధులకు సంబంధిత శాఖల జిల్లా అధికారులకు సకాలంలో పాస్ లు అందజేయాలని సూచించారు.

అలాగే అగ్నిమాపక శాఖ ... అగ్నిమాపక శకటాలను సిద్దంగా ఉంచాలన్నారు. సిఎం పర్యటన కు అంబులెన్స్ ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ అరేంజ్మెంట్ లు రెవెన్యూ అధికారులు చూడాలన్నారు.

సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి, డీసీసీబీ చైర్మన్ శ్రీకాంత్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్,

జిల్లా అదనపు కలెక్టర్ లు మందా మకరంద్,బిఎస్ లత, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు మంత్రులు తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు మోతె సభస్థలిని సందర్శించి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

వాహనాల రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

హిందూస్థాన్ సమాచార్/సంపూర్ణా చారి.


 rajesh pande