అమరావతి: ,05 ,డిసెంబర్ ( హిం.స) ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు సోమవారం వేర్వేరుగా దిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జీ20 సదస్సు నిర్వహణపై సోమవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్లో జరిగే అఖిలపక్ష సమావేశంలో వీరు పాల్గొంటారు. సీఎం జగన్ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.15 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొని, రాత్రి 7.55 గంటలకు దిల్లీ నుంచి తాడేపల్లి తిరుగు ప్రయాణమవుతారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు సోమవారం ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి 12:40కి దిల్లీ చేరుకుంటారు. సాయంత్రం అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు.
హిందుస్థాన్ సమాచార నాగరాజ్