నేడు జీ-20 సన్నాహక సమావేశం
ఢిల్లీ : డిసెంబర్ 5( హిం స) నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరగనుంది
....


ఢిల్లీ : డిసెంబర్ 5( హిం స) నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరగనుంది.. భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగనున్న జీ–20 సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశం ఇది.. అంటే, జీ-20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచన కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అధినేతలను సమావేశానికి ఆహ్వానించారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఈ సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన చీఫ్లు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande