నేడు లాలూకు కిడ్నీ మార్పిడి
ఢిల్లీ : డిసెంబర్ 5( హిం స) బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సింగపూర్లో
....


ఢిల్లీ : డిసెంబర్ 5( హిం స) బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సింగపూర్లో నేడు సోమవారం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని లాలూకు అమర్చనున్నారు. ఇందులో భాగంగా లాలూను వైద్యులు పరీక్షించారు. సర్జరీకి ముందు అవసరమైన టెస్టులు చేశారు. ఇదే సమయంలో రోహిణిని కూడా డాక్టర్లు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు లాలూ కుమార్తె రోహిణి ట్వీట్ చేశారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande